janaprabha

janam kosam manam

ముసాపేట జీహెచ్ఎంసీ సిబ్బందిపై కేసులు

1 min read

ముసాపేట జీహెచ్ఎంసీ సిబ్బందిపై కేసులు

కోర్ట్ ఆదేశాలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు…

ప్రజా ప్రతినిధుల కక్ష్యపూరిత చర్యల్లో పావులుగా

మారిన అధికారులు….

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జీహెచ్ఎంసీ సిబ్బందిపై కేసులు….

జీహెచ్ఎంసీకి మచ్చ తెచ్చిన అధికారులు…
కూకట్ పల్లి ఫిబ్రవరి 1,(జనప్రభ):
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారుల తీరు ప్రతీసారి వివాదాస్పదమవుతూనే ఉంది. స్థలాల నుండి మొదలు బిల్డింగ్ పర్మిషన్ల వరకు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు చుక్కలు చూపెడుతున్నారు. ప్రతీ చిన్న విషయానికి నానా రాద్దాంతం చేస్తున్నారు. ఒక్కోసారి వారి తీరు శృతి మించుతోంది. ఇందుకు అనేక ఉదాహారణలు ఉన్నాయి. కేపి హెచ్ బీ కాలనీ లో నివాసం ఉంటున్న అశోక్ రెడ్డి అనే వ్యక్తి ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ వెంచర్ అయిన కేపీహెచ్ బీ కాలనీ , థర్డ్ ఫేజ్ లో ‘ఎమ్ ఐజి’ బ్లాక్ 29/3 లో ఇంటిని కొనుగోలు చేశారు. కాగా ఆ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో జీహెచ్ఎంసీ అధికారుల నోటీసులతో అదే స్థలంలో కొత్త నిర్మాణం చేపట్టాలని పాత ఇంటి స్థలాన్ని కూల్చివేసి కొత్త నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈవిషయంలో జోక్యం చేసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు స్లాబ్ ఏరియా వరకు కట్టిన పిల్లర్స్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. నోటీసులు లేకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నించినందుకు లబ్ధిదారులను దుర్భాశలాడి, వారి మీద కేసులు పెడతామని బెదిరించి కేసులు నమోదు చేయించారు. ఆ ఇంటి స్థలం ఓపెన్ ఏరియా కింద ఉందంటూ అప్పటి వరకు ఇళ్లు ఉన్న స్థలంలో మూసాపేట సర్కిల్ మున్సిపల్ అధికారులు తమ సిబ్బందితో కలిసి దారి లేకుండా అడ్డంగా నిలువెత్తు గోడ పెట్టారు. ఆవిషయంలో బాధితులకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం కొందరు ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి తమ విధులను విస్మరించి ప్రభుత్వ అధికారి అయి ఉండి ప్రైవేట్ వ్యక్తుల స్థలాన్ని కబ్జా చేశారు. పైగా మా విధులకు ఆటంకం కలిగించారంటూ బాధితుల మీదనే కేసు పెట్టిన ఘనత ఆమెకే చెల్లింది. ఇది వరకు చెప్పినట్లు ఆసియాలోఖండంలోనే కేపీహెచ్ బీ కాలనీ అతిపెద్ద ప్రభుత్వ లే అవుట్.. డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి చెప్పిన కారణాలు, గోడ నిర్మాణం సరైనదే అయితే అప్పట్లో ప్రభుత్వం పర్మిషన్ ఎలా ఇచ్చింది. అప్పుడు ఇంత పెద్ద లే అవుట్ కు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానిది తప్పా.. అన్ని పత్రాలు, స్థలం ఉన్నా కక్ష్యపూరితంగా బాధితుల స్థలంలో నిలువెత్తు గోడ పెట్టించిన జీహెచ్ఎంసీ అధికారులది తప్పా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో గతంలో తాము కొన్న స్థల యజమానులు ఇచ్చిన డాక్యుమెంట్లు, పర్మిషన్ కాపీలు, అధికారిక లే అవుట్ తదితరాలను కోర్టుకు సమర్పించడం జరిగింది. దీనిపై స్పందించిన గౌరవ న్యాయస్థానం ముసాపేట సర్కిల్ జిహెచ్ఎంసి డీసీ ప్రశాంతి, అసిస్టెంట్ సిటీ టౌన్ ప్లానెర్ శ్రీధర్ ,టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ రాజేశ్వరి ఇతర సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కేపీహెచ్ బీ పోలీసులు సదరు అధికారిని డీసీ ప్రశాంతి, ఇతర సిబ్బందిపై (ఎఫ్ ఐఆర్ నెంబర్ 83/2021) 447,341,352,323,427,120b, సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కోర్టు ఆక్షేపణ వ్యక్తం చేయడమే కాకుండా, వారిపై పలు కేసులు నమోదు చేయమంటూ ఆదేశాలు జారీ చేయడం ప్రపథమం. ప్రభుత్వ అధికారి అయి ఉండి, ప్రజా ప్రతినిధుల చేతుల్లో పావులుగా మారితే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని, బాధితుల పక్షాన నిలుస్తాయని చెప్పేందుకు ఇదే ప్రభల నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published.