janaprabha

janam kosam manam

మళ్లీ కబ్జాలు షురూ….!

 

సర్వే నం:348/1 లో జోరుగా సాగుతున్న కబ్జాలు

కుతుబుల్లాపూర్ సెప్టెంబర్,(వార్తాప్రభ):
జగద్గిరిగుట్ట సర్వే నం. 348/1 లో కబ్జాదారులు రాటు తేలిపోతున్నారు. రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు అందిన చూసి వెళ్తున్నారే తప్ప ఇలాంటి చర్యలు చేపట్టట్లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే
కుతుబుల్లాపూర్ మండల్ పరిధిలోని జగద్గిరిగుట్ట సర్వే నం:348/1 ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా గుట్టపై జరుగుతున్న కబ్జాలే నిదర్శనం అనుకోవచ్చు, గతంలో కబ్జాలపై వచ్చినటువంటి శీర్షికతపై ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన కబ్జాదారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ సవాలు విసురుతున్నారు. స్థానిక ప్రజలను వివరణ కోరగా రెవెన్యూ అధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కబ్జా దారులతో దోస్తీ కలిపి అక్రమ విమానాలకు సహకరిస్తున్నారని విమర్శలు వెల్లాడెత్తుతున్నాయి. ఇలాంటి కబ్జాలు రింగ్ బస్తి, కూన మహాలక్ష్మి నగర్, షిరిడి హిల్స్, ప్రాంతాలలోని ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున కబ్జాలకు పాల్పడుతున్నారని వెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందిన అక్రమ నిర్మాణాలపై ఎలాంటి స్పందన లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. ఇప్పటికైనా ఆర్డిఓ, రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించి సర్వే నం:348/1 ప్రభుత్వ భూమిలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులపై చర్యలు తీసుకొని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.