జె.ఎన్.టి.యు హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ నిర్వహణ ఫీజు రద్దు చేయాలి:ABVP
1 min read
జె.ఎన్.టి.యు హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ నిర్వహణ ఫీజు రద్దు చేయాలి:ABVP
కుట్ పల్లి ఫిబ్రవరి 1,(జనప్రభ):
జె ఎన్ టి యు హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్ నిర్వహణ ఫీజు రద్దు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో రిజిస్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. లాక్ డౌన్లో మార్చి నెల తర్వాత నుండి ఇప్పటి వరకి తెరుచుకోని హాస్టల్ కి కి మెయింటెనెన్స్ ఫీజు అని చెప్పి ఒక్కొక్క విద్యార్ధి నుండి నెలకు రూ340 చొప్పున మొత్తం సుమారుగా నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరి నుండి వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మూడు వేలకు పైగా ఉన్నటువంటి విద్యార్థులు నుంచి కోటి 25 లక్షలకు పైగా వసూలు చేయడాన్ని ఖండిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ టెక్నికల్ సెల్ కన్వీనర్ తోట శ్రీనివాస్ మరియు *కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ సంజన్న గారి విజయ్ రెడ్డి* మాట్లాడుతూ విద్యార్థుల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే వెనక్కి తిరిగి ఇచ్చేయాలని సంబంధించిన నిర్వహణ ఫీజు ఏదైనా యూనివర్సిటీ భరించాలని డిమాండ్ చేస్తూ రిజిస్టార్ మరియు రెక్టార్లకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రామకృష్ణ, సాయి కుమార్, వర్షిత్, రిత్విక్ పాల్గొనడం జరిగింది.