janaprabha

janam kosam manam

తొర్రూరు మున్సిపాలిటీ ని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుత

తొర్రూరు మున్సిపాలిటీ ని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుత

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మహబూబాబాద్
తొర్రూర్ జనవరి 27,(జనప్రభ):
తొర్రూర్ మున్సిపాలిటీ ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు తొర్రూరు మున్సిపల్ పరిధిలో బుధవారం మంత్రి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తో పట్టణ ప్రకృతి వనాన్ని, ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రారంభించి, యతిరాజారావు పార్కును సందర్శించి ప్రారంభించారు.

అనంతరం జరిగిన తొర్రూరు మున్సిపల్ ప్రథమ వార్షికోత్సవ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీ ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఎన్ని కోట్లు అయినా వెచ్చించడానికి వెనుకాడని స్పష్టం చేశారు. అలాగే మాజీ శాసనసభ్యులు సుధాకర్ రావు సహకారంతో యతి రాజారావు పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు

పట్టణ అభివృద్ధికి రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిధులు కేటాయిస్తానని అన్నారని తెలియజేశారు.
మార్చి తర్వాత కౌన్సిలర్ లకు వార్డు యాభై లక్షలు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోవాలని అభివృద్ధి చేయకపోయినా నేనున్నానని భావన కలిగించాలి అన్నారు రురాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగం సాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టు కాలువల ద్వారా వ్యవసాయ సేద్యానికినీరుఅందిస్తున్నామన్నారు.
నిండు సభలో మిషన్ భగీరథ నీరు త్రాగుతూ 45 కోట్లు వెచ్చించి సురక్షితమైన త్రాగు నీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం తీసుకువచ్చామని, మినరల్ వాటర్ త్రాగరాదని దానివలన అనారోగ్యం పాలవుతారని తెలియజెప్పారు.
అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య కమిషనర్ గుండె బాబు జడ్పిటిసి శ్రీనివాస్ ఎంపీపీ అంజయ్య కోపరేటివ్ డైరెక్టర్ హరిప్రసాద్ మాజీ చైర్పర్సన్ గాంధీ నాయక్ తాసిల్దార్ రాఘవ రెడ్డి ఎంపీడీవో భారతి మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *