janaprabha

janam kosam manam

తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ ఒక మోసగాడు:తీన్మార్ మల్లన్

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్: 

నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల నుండి పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో తొర్రూరు కు చేరుకుంది పాదయాత్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు అయినా నాకు తెలంగాణలో ఎమ్మెల్సీ ప్రథమ ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకువిన్నవించుకున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు చేపడతామని చెప్పి తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారాన్ని సంపాదించి ఏ అధికారం అయితే ప్రజలు ఇచ్చారోఆ ప్రజలను మోసం చేస్తూ ఆరు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందిఅని తెలంగాణ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి కెసిఆర్ ఫామ్ హౌస్ ను 40 ఎకరాల నుండి 400 ఎకరాలకు పెంచుకొని చల్ ల్వాడ కాడ కేటీఆర్ కుఫామ్ హౌస్ కంది కాడ కవితమ్మ కు ఫామ్ హౌస్ అజీజ్ నగర్ కాడ హరీష్ రావు కు ఫామ్ హౌస్ కొండపోచమ్మ రిజర్వాయర్ కాడ సంతోష్ రావుకు ఫామ్ హౌస్ కట్టించుకున్నాడు తప్ప పేదలకు డబుల్ బెడ్ రూముఇల్లు మర్చిపోయాడనీ వారు ఎద్దేవా చేశారు.

తీన్మార్ మల్లన్న గా కేసీఆర్ అవినీతి పాలన గురించి చెబితే తనపై 20 కేసులు నమోదు చేశాడని అయినా తీన్మార్ మల్లన్న ఎవరికీ భయపడేవాడు కాదని రెండు వందల కేసులు పెట్టినా ప్రజల పక్షాన మాట్లాడతానని వారన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో భూకబ్జాలకు పాలుపడుతుందని దానిలో భాగంగానే మొన్న టిఆర్ఎస్ పార్టీ మంత్రి మల్లారెడ్డి నిన్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ దందాలకు పాల్పడి వారే భూమిపై పడుకుని నిరసన తెలుపుతూ తూ దొంగే దొంగ అన్న చందంగా ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని వారు వాపోయారు.

ఇలాంటి అవినీతి పాలనను అంతం చేయాలని తెలంగాణ ప్రజలు దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి అదేవిధంగా హైదరాబాదులో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పారని వారు గుర్తు చేశారు ఈరోజు తీన్మార్ మల్లన్న పాదయాత్ర తో కెసిఆర్ అవినీతి పాలనను బట్టబయలు చేస్తుంటే రాత్రికి రాత్రి తెలంగాణలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ మోసపూరితమైన వాగ్దానాలకు తెరలేపారని తెలంగాణ నిరుద్యోగ యువతను మరొకసారి మోసం చేయడానికి పూనుకున్నాడని వారు తెలిపారుతెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు డీఎస్సీ పెట్టి ఫలితాలు రాగానే కోర్టు కేసుల్లో ఇరికించి ఏ ఒక్కరి కి కూడా ఉద్యోగం రాకుండా చేసిన మోసగాడని వారు గుర్తు చేశారు కావున వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రులు మరొకసారి కెసిఆర్ మాటలకు మోసపోకుండా ఆయన పాలనకుచరమగీతం పాడాలని ఆ అన్యాయాన్ని ఎదిరిం చాలంటే ప్రశ్నించే గొంతు నైనా నన్ను పట్టభద్రుల నియోజకవర్గం నుండి గెలిపించుకొని ప్రశ్నించే స్వరాన్ని వినిపించే విధంగా పట్టభద్రులు నడుం బిగించాలని వారన్నారు.

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్లు కూడా అధికార పక్షానికి లొంగి పోయి పని చేస్తున్నారని అందుకనే ప్రజలకు జరిగేఈ అన్యాయాన్నిప్రశ్నించడానికి నేను ముందుకు వచ్చానని వారన్నారు కావున తెలంగాణ పట్టభద్రులైన విద్యార్థి మేధావులు నన్ను బలపరిచి తెలంగాణ నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండ గట్టుట కు ఒక అవకాశం నాకు కల్పించాలని వారు కోరారుఈ కార్యక్రమానికి తొర్రూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పస్తంసైదులు ప్రధాన కార్యదర్శి సిరికొండ విక్రమ్ ఉపాధ్యక్షులు ఇమ్మడి రాంబాబు కార్యదర్శి పంతం సురేందర్ సహాయ కార్యదర్శిరామకృష్ణప్రచార కార్యదర్శి పంతం విజేందర్ ఈసీ మెంబర్ బూరుగు శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *