janaprabha

janam kosam manam

కొత్తగూడెం జిల్లా సగర సంఘం అధ్యక్షులుగా మల్లేశం సగర

సగర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కట్లు కేటాయించాలి: శేఖర్ సగర
జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మల్లేశం సగరకు నియామకపు పత్రాన్ని అందజేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సగర

సమావేశంలో మాట్లాడుతున్న శేఖర్ సగర

నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న రాష్ట్ర కమిటీ

శేరిలింగంపల్లి జనవరి 23, బద్రాద్రి కొత్తగూడెం జిల్లా సగర సంఘం అధ్యక్షులుగా కొడిపాక మల్లేశం సగర ఎన్నికయ్యారు.శనివారం కొత్లతగూడెంలో రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అధ్యక్షతన జరిగిన ఎన్నికల సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.జిల్లా సగర సంఘం అధ్యక్షులుగా కొడిపాక మల్లేశం సగర,ప్రధాన కార్యదర్శిగా అనిశెట్టి భిక్షపతి సగర,కోశాధికారిగా గండికోట వెంకటేశ్వర్లు సగర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా గుంటి కృష్ణయ్య సగర,చాతిరి రమణయ్య సగర, రాజయ్య సగర గుంటి మల్లేశం లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సంర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సగరుల హక్కులను కాలరాస్తుందని అన్నారు.కులవృత్తి నిర్మాణ రంగం పై ఆధారపడిన సగర జాతిని ఆర్థికంగా చేయూతనందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.గతంలో ఉన్న ప్రభుత్వాలు కులవృత్తుల పై ఆధారపడిన కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయింపులు చేశాయని, కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయించడం లేదని అన్నారు. సగరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సగర కార్పోరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.కోకాపేట స్థల సమస్య పరిష్కరించి మాకు కేటాయించిన భూమిని మాకు అప్పగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యధర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి నలుబాల భిక్రపతి సగర, రాష్ట్ర సంయుక్త కార్యనర్శి ధామోరయ్య సగర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *