janaprabha

janam kosam manam

ఎమ్మెల్యే గాంధీ చేతులమీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..


శేరిలింగంపల్లి జనవరి 10,(జనప్రభ):
శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ జయ నగర్ కాలనీ నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు మరియు ఎమ్మెల్యే కాలనీ సమస్యలపై పాదయాత్ర చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. విజయనగర్ కాలనీ వాస్తవ్యులు అందరూ కలిసి కమ్యూనిటీ హాల్ కట్టించమని అభ్యర్థించారు మరియు రహదారులు డ్రైనేజీ మంజీరా నీళ్లు విద్యుత్ లో ఓల్టేజీ సమస్యలను తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యేని కోరారు. ఎమ్మెల్యే సమస్యలను సావధానంగా తిని సాధ్యమైనంతవరకు ఈ సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 123 డివిజన్ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ నాన్న శ్రీనివాస్, జయ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి గౌడ్ జనరల్ సెక్రెటరీ సురేంద్ర నాథ్ రెడ్డి, ట్రెజరర్ నవీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలినేని శ్రీనివాస్ కమిటీ సభ్యులు సుశీల్ కుమార్, వి.శ్రీనివాస్, జే వీ రావు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *