ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నాలాల అభివృద్ధి పై సమావేశం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి జనవరి 20, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శేరిలింగంపల్లి సర్కిల్,చందానగర్ సర్కిల్, కూకట్పల్లి సర్కిల్ లోగల నాలాల అభివృద్ధి మరియు పురోగతి పై జోనల్ కమీషనర్ రవి కిరణ్ తో,చీఫ్ ఇంజనీర్ వసంత తో,ఇరిగేషన్,రెవెన్యూశాఖ, టౌన్ ప్లానింగ్,జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నాలా విస్తరణ పనుల పై చర్చించడం జరిగినది.నాలా విస్తరణ పనులు వేగవంతం చేయాలనీ,వరద నీరు ప్రవహించే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని అదేవిదంగా పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా ఈ మధ్య కురిసిన వర్షాలతో చెరువుల మధ్యలో ఉన్న నాళాల ద్వారా ఒక చెరువు నుండి మరొక చెరువుకు నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అవరోధాలు లేకుండా నాళాలను అభివృద్ధి చేసే ప్రత్యేక ప్రణాలికను తీసుకోవాలని తెలియజేసారు.ఎన్నో రోజుల నుండి చేపడుతున్న అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని,దీప్తి శ్రీ నగర్ నాలా విస్తరణ లో భాగంగా సిబిఆర్ ఎస్టేట్స్ వద్ద అసంపూర్తిగా మిగిలిపోయిన రక్షణ ప్రహరీ గోడ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని,జనప్రియ నాలా పనులు పూర్తయ్యేలా చూడాలని,పి.జె.ఆర్ రోడ్డు కల్వర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని,నాలా విస్తరణ పనులు పూర్తి స్థాయిలో చేపట్టడం ద్వారా ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యకి శాశ్వత పరిష్కారం అవుతుంది అని, అందుకే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి నిర్ణిత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడలని,త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలని అధికారులను కోరడం జరిగినది. నాలా విస్తరణ పనులు,నాలా నిర్మాణ పనుల పై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు,జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్,సాయి బాబా,దొడ్ల వెంకటేష్ గౌడ్,హమీద్ పటేల్,సింధు ఆదర్శ్ రెడ్డి, పూజిత జగదీశ్వర్ గౌడ్,మాధవరం రోజాదేవి రంగారావు,రెడ్డి మంజుల రఘునాథ్ రెడ్డి మరియు అధికారులు సీఈ వసంత,సీఈ రమణ,సీపీ శ్రీనివాస రావు,ఏసీపీలు వేణు,సంపత్,ఏస్ఈ శంకర్,డీఈ లు శ్రీనివాస్,రమేష్, శ్రీరాములు,సత్యనారాయణ,సురేష్ కుమార్,రూప దేవి,రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహిపాల్ రెడ్డి,ఏఈ లు శేషగిరి రావు,రవీందర్,శ్రీనివాస్, శేఖర్ రావు,సునీల్ కుమార్,శివ కృష్ణ,రమేష్,అనురాగ్,ప్రశాంత్, సుభాష్,శివ ప్రకాష్,రాజీవ్,స్వప్న, తదితరులు పాల్గొన్నారు.