ఎన్.టి.ఆర్ విగ్రహానికి నివాళి అర్పించినఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి జనవరి 18,
తెలుగు జాతిఇలవేలుపు,మరణం లేని జననం విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ,నటరత్న,పద్మ శ్రీ స్వర్గీయ డా.నందమూరి తారక రామారావు 25 వ వర్థంతి సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సొసైటీ లో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు తో,ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆ మహానుబావుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని తెలియజేసారు.అదేవిదంగా ఎంతో మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు.రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని
మరణం లేని జననం
తెలుగువాడి కీర్తిని నలుదిశలా చాటిచెప్పిన యుగపురుషుడు అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు రంగరాయ ప్రసాద్,పోతుల రాజేందర్,అష్రాఫ్,అప్పిరెడ్డి,శివ రెడ్డి,కుమార స్వామి, ప్రభాకర్ రెడ్డి,నర్సింహ రావు,కాలనీ వాసులు హరి బాబు,శ్రీధర్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.