janaprabha

janam kosam manam

కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను ప్రారంభిస్తున్న కార్పొరేటర్లు రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌,హ‌మీద్‌ పటేల్

శేరిలింగంపల్లి జనవరి 16,  మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడటానికి శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేసి కనిపెట్టిన కోవిడ్ వ్యాక్సిన్ నేటి నుండి దేశ ప్రజలకు అందుబాటులో ఉంటుందని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు.శనివారం రోజున కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్,శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కలసి కొండాపూర్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో కరోనా వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు.
ఇందులో భాగంగా ఈ శనివారం కొండాపూర్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో కరోనా వాక్సినేషన్ మొదటి టీకాను డా.నాగరాజు మరియు డా.పుల్లారెడ్డి కు వినియోగించటం జరిగింది.
ఈ సందర్బంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ..
కరోనా కష్ట కాలంలో అహర్నిశలు ప్రజల కోసం కష్టపడిన వైద్య సిబ్బందికి మొదటి కరోనా వ్యాక్సినేషన్ టీకాను వినియోగించటం జరిగిందని తెలిపారు.ప్రతి ఒక్కరికి కూడా కరోనా వ్యాక్సినేషన్ అందేలా ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు.కరోనా వారియర్స్ అయినా వైద్య సిబ్బంది,పారిశుధ్య సిబ్బంది,పోలీసు సిబ్బంది అలాగే అత్యవసర ప్రజలకు వీటిని మొదటిగా వారికి వినియోగించటం జరుగుతుందని తెలిపారు.దశల వారీగా అందరికీ వ్యాక్సిన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.
ఎవరూ కూడా వ్యాక్సిన్ సామర్ధ్యంపై ఎటువంటి సందేహాలు అపోహలు పెట్టుకోకుండా,ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ టీకాను వేయించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్,శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్,డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్
డా.సృజన,డి ఎస్ ఓ డా.మనోహర్ రాథోడ్,డి సి హెచ్ ఎస్ డా ఝాన్సీ లక్ష్మి, మెడికల్ సూపెర్నిడెంట్ డా.దశరథ్,డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్,వార్డు మెంబర్స్ నిర్మల, రూప రెడ్డి,శ్రీనివాస్ చౌదరి, జంగంగౌడ్,ఏరియా కమిటీ మెంబర్స్ మంగమ్మ,తిరుపతి యాదవ్, హిమామ్,తెరాస సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, సైబర్ హిల్స్ భాస్కర్ రెడ్డి,లక్ష్మి నారాయణ ముదిరాజ్,బసవయ్య, నందు,గణపతి,డా.రమేష్,గిరిగౌడ్, యాదగిరి,వెంకట్ రెడ్డి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *