janaprabha

janam kosam manam

శ్రీరాముని మందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి: భేరీ రామచందర్ యాదవ్

శ్రీరాముని మందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి: భేరీ రామచందర్ యాదవ్

శేరిలింగంపల్లి ఫిబ్రవరి 4, (జనప్రభ):

గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ లోని వెలిసిన శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది భాగ్యనగర అర్చక పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీనివాసాచార్యులు బృందం వారి ఆధ్వర్యంలో కార్యక్రమం 11వ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ దేవాలయాలలో దేవతల విగ్రహాలు ధ్వంసం చేయడం చాలా బాధాకరమని అన్నారు ఇందుమూలంగా దేశ ప్రజలకి ఎలాంటి ఆపద రాకుండా దేశ ప్రజలందరికీ మంచి జరగాలని ఒక మంచి సంకల్పం 41 ఒక్క రోజు సీతారాముల కళ్యాణమహోత్సవం దీక్ష కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా నేతాజీ నగర్ కాలనీ షిరిడి సాయిబాబా ఆలయంలో పదకొండవ కళ్యాణం ఘనంగా చేయడం జరిగింది శ్రీ సాయి బాబా ఆలయ ప్రధాన అర్చకులు జోషి రాఘవేంద్ర శర్మ వారి పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వారు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో భగవంతుని కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని అన్నారు కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని మందిరం నిర్మాణం కోసం శ్రీ రామ మందిరం ట్రస్టు అకౌంట్లోకి పంపించడం జరిగింది అన్నారు ఆలయ నిర్మాణంలో మనందరం భాగస్వాములు కావడం మన పూర్వజన్మ సుకృతం అని అన్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరు కులమతాలకతీతంగా శ్రీరాముని మందిరం నిర్మాణం లో మనకు తోచినంత విరాళాలు ఇచ్చి మనమందరం భాగస్వాములు కావాలి కోరారు పూజా కార్యక్రమంలో సాయి సేవకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *