janaprabha

janam kosam manam

డిప్యూటీ కమిషనర్ వెంకన్న కి వినతి పత్రం అందజేసిన కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి,రవి కుమార్ యాదవ్

డిప్యూటీ కమిషనర్ వెంకన్న కి వినతి పత్రం అందజేసిన కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి,రవి కుమార్ యాదవ్

శేరిలింగంపల్లి ఫిబ్రవరి 4,(జనప్రభ):

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ లో జిహెచ్ఎంసి అధికారులు రోడ్ డివైడింగ్ పేరుతో పేదల దుకాణాలను కూల్చివేయడం వెంటనే ఆపాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ లో ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా దుకాణాలు కూల్చివేయడం ను వెంటనే ఆపాలని గురువారం శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వెంకన్న కి స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మరియు రవి కుమార్ యాదవ్ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నానక్ రామ్ గూడ లో మున్సిపల్ అధికారులు చేపట్టిన
దుకాణాల కూల్చివేతలు నిలిపివేయాలని కోరగా,డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు.ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించకుండా సమస్య పరిష్కరించాలని కోరడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు,కార్యకర్తలు, బాధితులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *