హఫీజ్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తున

వైద్యాధికారి డాక్టర్ వినయ్ బాబు, స్థానిక కార్పొరేటర్లు పూజిత,జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి జనవరి 16, పెట్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొలి రోజు టికాను వేసే కార్యక్రమంలో ఇంచార్జి డాక్టర్.వినయ్,డి.ఎం.హెచ్.ఓ రాజశేఖర్,హెల్త్ ఆఫీసర్ రవి తో కలిసి పాల్గొన్నారు హఫీజ్ పెట్.మాదాపూర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్ మాట్లాడుతూ.శనివారం దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైయిందని,తెలంగాణలో 139 కేంద్రాల్లో సుమారు 4వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని,తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి గాను టీకాలు వేయడం జరుగుతుందని,తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని.కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ,వ్యాక్సిన్ పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు బల్లింగ్ యాదగిరి గౌడ్,వార్ సభ్యులు వెంకటేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్,సంగా రెడ్డి,జామీర్,వెంకట్ రెడ్డి,రమేష్,పాషా తదితరులు పాల్గొన్నారు..