*మాదినగూడ లో మహాత్మా గాంధీ కి ఘనంగా నివాళి

మాదినగూడ లో మహాత్మా గాంధీ కి ఘన నివాళి
శేరిలింగంపల్లి జనవరి 30,(జనప్రభ):
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదినగూడ గాంధీ విగ్రహం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను అని అన్నారు.వారు శాంతి,అహింస,నిస్వార్థ సేవల మార్గదర్శి అని అన్నారు. స్ఫూర్తిదాయక మాటలు,చేతల ద్వారా వారు కాలం మీద చెరగని ముద్ర వేసి,అహింసా మార్గం దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రేరేపించారు అని అన్నారు.అణగారిన,సామాజికంగా వెనుకబడిన,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్ముడు అవిశ్రాంత కృషి చేశారు అని అన్నారు.వారి జీవితం,సిద్ధాంతాలు ప్రపంచానికి స్ఫూర్తిని పంచుతున్నాయి అని అన్నారు.ఆయన వర్థంతి సందర్భంగా మహాత్ముని బోధనలను, వారు చూపిన మార్గాన్ని అనుసరించే దిశగా కంకణబద్ధులమౌదాం అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బల్ రాజ్,మల్లేష్,వేణు గౌడ్,శివ ముదిరాజ్,రవి,నాయకులు జనార్దన్ మరియు తదితరులు పాల్గొన్నారు