ఘనంగా 73వ మహాత్మాగాంధీ కి ఘన నివాళి

ఘనంగా 73వ మహాత్మాగాంధీ కి ఘన నివాళి
శేరిలింగంపల్లి జనవరి 30,(జనప్రభ):శేరిలింగంపల్లి నియోజకవర్గం లో జాతిపిత బాపూజీ మహాత్మాగాంధీ 73 వ వర్ధంతి సందర్భముగా ఎమ్మెల్యే నివాసంలో మహాత్మ గాంధీ చిత్రపటానికి కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్,ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు తెరాస నాయకుల తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళ్లర్పించి,మౌనం పాటించిన ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ ఈ సందర్భమగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కుళ్లాయి కట్టి చేత కర్రబట్టి,నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి,అన్ని మతాలు కులాలూ ఒకటే అని చాటి,కోట్లాది భారతీయులను ఏకం చేసి,ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత దేశం నుండి పారదోలి దేశానికి స్వాతంత్రం ను అందించిన మహానుభావుడు గాంధీ అని చెప్పడం జరిగినది,అహింస మార్గం లో,గాంధేయమార్గం లో దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్ముడు గాంధీ కి ఘన నివాళ్లు అర్పిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పడం జరిగినది ఈ రోజు స్వాతంత్రం అనుభవిస్తున్నామంటే అది ఆ మహాత్ముడి కృషి ఫలితమే అని సత్యాగ్రహం,అహింస,నిజాయితీ వంటి మార్గాలను ఎంచుకొని అటువైపుగా ప్రజలను భాగస్వామ్యం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొనడం జరిగినది మహాత్ముడు చూపిన బాటలో అందరు నడవాలని,గాంధీ చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలి అని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునివ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, లక్ష్మారెడ్డి,మాలికార్జున్ శర్మ,దొడ్ల రామకృష్ణ గౌడ్,కొమ్మగల్ల మోజేష్,నటరాజ్,వాసుదేవ రావు, విజయమ్మ,బాలస్వామి,గుడ్ల శ్రీనివాస్,నిమ్మగళ్ల అర్జున్,నల్లోల్ల రాము,అనంతయ్య,ఆదర్శ్,సంకి సత్యం,రమేష్,మీరయ్య తదితరులు పాల్గొన్నారు.