janaprabha

janam kosam manam

రామ‌మందిర నిర్మాణంలో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

రామ‌మందిర నిర్మాణంలో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

శేరిలింగంపల్లి జనవరి 29,(జనప్రభ):అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం కొరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మైత్రి నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన “శ్రీరామ జన్మ భూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ “లో భాగంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జిల్లా సభ్యులు& బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్,సంఘ్ పరివార్ పెద్దలు కృష్ణ రెడ్డి,భూషణ్ జీ,కోటేశ్వరరావు కలసి ఇంటింటికి జన జాగరణ కార్యక్రమం నిర్వహించి కొంతమంది ప్రముఖ వ్యాపారస్తులను కలవడం జరిగింది.వారు సానుకూలంగా స్పందించి విజేత అధినేత జగన్ మోహన్ రావు 9,45,000 రూపాయలను,విశ్వనాథ్ గార్డెన్ అధినేత రాజు 25,116 రూపాయలను,మైత్రి నగర్ కు చెందిన రాజశేఖర్ రెడ్డి 11,116 రూపాలయలను,రామకృష్ణ 5,116 రూపాలయలను,దేవాలయ అర్చకులు ఫణి,వసంత్ కుమార్ 4,000 రామ జన్మభూమి మందిరానికి నిధిలను సమర్పించారు.ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు,బిల్డర్ లు,ఆలయ అర్చకులు మరియు తదితరులు రామ జన్మభూమి మందిర నిర్మాణానికి ముందుకు వచ్చి నిధులు సమర్పించడం శుభదాయకం అని అన్నారు.అలాగే ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముడి ఆశీర్వాదాలు కలగాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *