రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధికి విజేత సూపర్ మార్కెట్స్ జగన్ మోహన్ రావు రూ.9.45 లక్షల సమర్పణ

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధికి విజేత సూపర్ మార్కెట్స్ జగన్ మోహన్ రావు రూ.9.45 లక్షల సమర్పణ
శేరిలింగంపల్లి జనవరి 29,(జనప్రభ):
అయ్యోధ్య శ్రీ భవ్య రామమందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ జనజాగరణలో భాగంగా విజేత సూపర్ మార్కెట్స్ అధినేత జగన్ మోహన్ రావు ని కలవడం జరిగింది.వారు రామ మందిర నిర్మాణ నిధి సమర్పణలో తనవంతుగా రూ.9.45 లక్షల చెక్కును అందజేశారు.తదనంతరం వారి గోశాలను సందర్శించి గో రక్షణ మరియు సేవలో పాల్గొంటున్న జగన్ మోహన్ రావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సంఘ్ ప్రముఖులు నారాయణ మూర్తి,రమణ రెడ్డి,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్,సీనియర్ నాయకులు నందకుమార్ యాదవ్,గోవర్ధన్ గౌడ్,మహిపాల్ రెడ్డి,వినయ్ గౌడ్,కుమార్ యాదవ మరియు తదితరులు పాల్గొన్నారు.