ప్రతి ఒక్కరూ రామ కార్యంలో పాలుపంచుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

శేరిలింగంపల్లి జనవరి 23
అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం కొరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మైత్రి నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీరామ జన్మ భూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్,సంఘ్ పరివార్ పెద్దలు కృష్ణ రెడ్డి,రమణ రెడ్డి,భూషణ్ జీ,కోటేశ్వరరావు కలసి ఇంటింటికి జన జాగరణ కార్యక్రమం నిర్వహించి కొంతమంది ప్రముఖ వ్యాపారస్తులను కలవడం జరిగింది.వారు సానుకూలంగా స్పందించి బిజ్జం చారటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిజ్జం వెంకరేశ్వర్ రెడ్డి, 1,11,116 రూపాలయలను,బిల్డర్ రాధాకృష్ణ 25116 రూపాలయలను,వెంకటేష్ యాదవ్ 11116 రూపాలయలను,శ్రీనివాస్ 10116 రూపాయలను మరియు సప్తగిరి కాలనీ వాసులు స్వచ్ఛందంగా తిరిగి 70,000 రూపాలయలను రామ జన్మభూమి మందిరానికి నిధిలను సమర్పించారు.ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు,బిల్డర్ లు మరియు తదితరులు రామ జన్మభూమి మందిర నిర్మాణానికి ముందుకు రావడం శుభదాయకం అని అన్నారు.అలాగే ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముడి ఆశీర్వాదాలు కలగాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.