janaprabha

janam kosam manam

నరేంద్ర మోడి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి

కూకట్ పల్లి జనవరి 23,

3 రోజుల ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కలిపిస్తాం అని బిల్లు ను సమర్ధించడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ నే కారణం అంటూ కూకట్ పల్లి కేపీ.హెచ్.బి టెంపుల్ బస్ స్టాప్ నందు బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి మరియు స్థానిక బీజేపీ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ అగ్రవర్ణ పేదలు ను ద్రుష్టి లో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ 3సంవత్సరాల క్రితం బిల్లును ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఇన్ని రోజుల తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్లు కలిపిస్తాం అని ప్రకటన చేయడం కారణం బీజేపీ పార్టీ నే అని ఆయన తెలియజేసారు. కేసీఆర్ మెడలు వచ్చి ఈరోజు ఈ బిల్లుని ఒప్పించిది భారతీయ జనతా పార్టీనే అని అన్నారు. దుబ్బాక మరియు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ప్రభావం తో కేసీఆర్ భయపడి బీజేపీ పార్టీ యొక్క డిమాండ్ ను ఒప్పుకోవడం జరిగిందని అందుకు గాను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విజయం గా భవిస్తూ శనివారం నాడు కేపీ.హెచ్.బి కాలనీ లో ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు వినోద్ గౌడ్ ,శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం రాష్ట్ర నాయకులు పట్లోళ్ల సాయినాథ్ రెడ్డి ,మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మగ్ధుమ్, కార్యదర్శి సుగుణ, ఎస్సీ మోర్చా రామకృష్ణ, వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్, జ్యోతి, స్రవంతి ,రేవతి ,మెట్టు శీను, తోట రమేష్ ,రవి నాథ్ ,వరలక్ష్మి , నవీన్ కుమార్, మధుసూదన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, దేవ సహాయం, యాదిరెడ్డి, వెంకటేశ్వర్, తుల్జ, విజయ్ ,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *