janaprabha

janam kosam manam

బస్తి లో సమస్యలను పరిశీలించిన కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంపల్లి జనవరి 21,  కొండాపూర్  డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో పలు వీధులలో పాదయాత్ర చేసి పలు సమస్యలను తెలుసుకున్నారు.ప్రేమ్ నగర్ ఏ బ్లాకు సాయి రాం స్కూల్ వీధిలో గల ఓపెన్ నాలా డ్రైనేజీ సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి, త్వరిత గతిన సమస్యను పరిష్కరిస్తానని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.ప్రజల కోరుకునే విధంగా మౌలిక వసతులు ఏర్పాటు చెయ్యటం జరుగుతున్నదని, ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు లేని డివిజన్ గా తీర్చి దిద్దటానికి తీవ్ర కృషి చేస్తున్నట్టు కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్కొన్నారు.హమీద్ పటేల్ తో బాటుగా ఏరియా కమిటీ మెంబర్ హిమామ్,తెరాస సీనియర్ నాయకులు మహ్మద్ ఉస్మాన్,ఖాజా భాయ్, జావిద్,రాజు,మాఝర్,యూత్ నాయకులు దీపక్,మహ్మద్ నసీరుద్దీన్,వెంకటేష్, అఖీల్, కిషన్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *