janaprabha

janam kosam manam

అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

*అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్*

శేరిలింగంపల్లి జనవరి 21 (వార్తప్రభ):శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంతి నగర్ లో వివిధ అభివృద్ధి పనులను గురువారం ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపుడి గాంధీ చోరవతో డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.దశలవారీగా డివిజన్ లోని కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ప్రశాంత్ నగర్ లో నెలకోన్నటువంటి రోడ్డు,డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ప్రజల అభిష్టం మేరకు కోబ్బరి కాయ కోట్టి నూతన సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు జె.యాదయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ దాసోజ్, వెంకటేశ్వర రెడ్డి,పార్థసారథి,అశోక్ కుమార్,బాబు కుట్టేన్,సువిజయ్, సతీష్, విజయ్,సుధాకర్,గోపి నగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్,నెహ్రూ నగర్ బస్తీ యూత్ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ దేవులపల్లి,ఘనపురం రవీందర్,పట్లోళ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *