మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు

శామీర్ పేట
భారత స్వాతంత్ర్య సమర యోధులు , భారత రత్న , దేశ రెండవ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 55 వ వర్ధంతి సందర్భంగా శామీర్ పేట లో కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిక పోషించారని, దేశం ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రధాని గా వారు దేశానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. 1965 లో భారత్, పాక్ యుద్ధం సమయంలో ఆయన జై జవాన్ జై కిసాన్ నినాదం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది అని, యువత వారి ఆదర్శాలను కొనసాగించాలని అఫ్జల్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, మేడి భాస్కర్ , రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.