janaprabha

janam kosam manam

సంక్షేమ సంఘాలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి :ఎమ్మెల్యే కేపి వివేకానంద

 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జనవరి 10,(జనప్రభ):125 గాజులరామారం డివిజన్ పరిధిలోని కైలాష్ హిల్స్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా కమిటీ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అశోక్ కుమార్, జెనరల్ సెక్రెటరీ సతీష్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి, ట్రెజరర్ వెంకటేశ్వర రావు, మెంబర్స్ సురేష్, యాదయ్య, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *