టీటీడి హిందూ ధర్మప్రచార పరిషత్ నిర్వహించిన గోపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జనవరి 15, 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ ఉమా మహేశ్వర ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మప్రచార పరిషత్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సంప్రదాయాల్లో తల్లితో సమానంగా గోమాతను పూజిస్తారని, గోవుకు పురాణాల్లో విశిష్ట స్థానం ఉందన్నారు. గోవును పూజించి రక్షిస్తే అనేక మంచి ఫలితాలు కలుగుతాయన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మప్రచార పరిషత్ చేపడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మధు మోహన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముద్ధాపురం మధన్ గౌడ్, సురేష్ రెడ్డి, చౌడ శ్రీనివాస్ రావు, నాగిళ్ల శ్రీనివాస్, ఫెరోజ్, కస్తూరి బాల్ రాజ్, వార్డు సభ్యుడు సిద్దిక్, సుభాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.