janaprabha

janam kosam manam

విద్య విజయతీరాలకు చేరుస్తుంది…

1 min read

కుత్బుల్లాపూర్ జనవరి 13,
హైదరాబాద్ నారాయణగూడలోని ‘కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా‘ ఫ్యామిలీ లా (3 YDC) ఉస్మానియా యూనివర్సిటీ చివరి సంవత్సరం ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల గ్రామానికి చెందిన యువతి గొరిగె వందన టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలవడంతో గొరిగె వందనను ఎమ్మెల్యే అభినందించారు. విద్య ఉన్నత శిఖరాలను అందుకునేలా చేస్తుందని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధనకు కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గొరిగె అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
*సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ 127డివిజన్ పరిధిలోని వెంకట్ రామ్ రెడ్డి నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా కమిటీ అధ్యక్షుడు సతీష్ గట్టోజి ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు అబ్దుల్ ఖాదర్, లక్ష్మణ్ గౌడ్, నాయకులు సుధాకర్, జల్దా లక్ష్మీనాథ్, రషీద్, సుదర్శన్, అంజి ముదిరాజ్, నవీన్, సుమన్, రాజేష్, వేణు, సంతోష్, సాయి, వెంకట్, నిహార్, అభిరామ్, తేజ, ఓం ప్రకాష్, దుర్గా ప్రసాద్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *