janaprabha

janam kosam manam

స్వామి వివేకానందను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి…

158వ పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ జనవరి 12,
రంగారెడ్డి నగర్ 127డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ కమిటీ హాల్లో స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా గాంధీ నగర్ స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ మరియు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు (బంజారాహిల్స్) వారి సౌజన్యంతో 15వ సారి నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానీయుడు స్వామి వివేకానందను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని దేశ భవిష్యత్తుకు పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. అంతటి మహానీయుడి పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకరమని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చిన సంస్థలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ నగర్ స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్, వార్డు సభ్యుడు అబ్దుల్ ఖాదర్ మరియు సాయి గౌడ్, తిమ్మయ్య, విజయ్, సందీప్, శ్రీనివాస్, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.
*ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే…*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘం 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్ లోని తన కార్యాలయం వద్ద ముఖ్య అతిథిగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *