స్వామి వివేకానందను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి…

158వ పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం..
కుత్బుల్లాపూర్ జనవరి 12,
రంగారెడ్డి నగర్ 127డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ కమిటీ హాల్లో స్వామి వివేకానంద, లయన్స్ క్లబ్ ప్రతినిధులు జవహార్ ,సతీష్ కుమార్ సెక్రెటరీ గాంధీ నగర్ స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ మరియు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు (బంజారాహిల్స్) వారి సౌజన్యంతో 15వ సారి నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జల్దా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు మాట్లాడుతూ దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానీయుడు స్వామి వివేకానందను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి గౌడ్ తిమ్మయ్య, శ్రీనివాస్, విజయ్, నవీన్, శ్రీధర్, శీను ,నీలగిరి, మురళి ,తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.