కార్పొరేటర్ శేషగిరిరావు పుట్టినరోజు సందర్భంగా బురగ రాజు ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

కుత్బుల్లాపూర్ జనవరి 14,
ఓల్డ్ ఏజ్ హోమ్ విశ్వసృష్టి ఆరోగ్యం ఆర్గనైజేషన్ వృద్ధాశ్రమానికి కైసర్ నగర్ రాజన్న బస్తీలో జరిగిన కార్యక్రమానికి కైసర్ నగర్ రాజన్న బస్తి టిఆర్ఎస్ నాయకులు బురగ రాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్నందున పేద బిక్కి ప్రజలకు మానవతా దృక్పథంతో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ విశ్వసృష్టి ఆరోగ్యం ఆర్గనైజేషన్ వృద్ధాశ్రమానికి ఉచితముగా దుప్పట్లను పంపిణీ చేసే కార్యక్రమాలు చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి సంస్థలను ప్రోత్సహించడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమములో ఫౌండేషన్ తామరాడ పద్మశ్రీ పాల్గొన్నారు.