janaprabha

janam kosam manam

పేదలకు అన్ని విధాలా టీఆర్ఎస్ ప్రభుత్వం అండ…

పేదలకు అన్ని విధాలా టీఆర్ఎస్ ప్రభుత్వం అండ…

*రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే…*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జనవరి 26,
కుత్బుల్లాపూర్131 డివిజన్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్ కు చెందిన శ్రీనివాస్ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో శ్రీనివాస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని ఆశ్రయించారు. కాగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద చింతల్ లోని తన కార్యాలయంలో దరఖాస్తు చేయించి రూ.2.00 లక్షలు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్వయంగా బాధితకుటుంబానికి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేఎం గౌరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *