janaprabha

janam kosam manam

సంక్షేమ సంఘం సభ్యులు ఐకమత్యంతో ఉంటూ.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గట్టు అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలస్వామి, కార్యదర్శి సతీష్, వైస్ ప్రెసిడెంట్ నర్సింహా యాదవ్, కోశాధికారి కుమార్, జాయింట్ సెక్రటరీలు మిరాజ్, లక్ష్మణ్, గట్టయ్య, శ్రీను పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *