janaprabha

janam kosam manam

ఎస్టీ పాల్స్ లూథరన్ చర్చ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ జనవరి 26,

రంగారెడ్డి నగర్127 డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్టీ పాల్స్ లూథరన్ చర్చ్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన చర్చ్ ను ప్రారంభించడం ఎంతో సంతోషకరం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రిస్టియన్ సోదరుల అభ్యున్నతికి గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా కృషి చేస్తుందని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులకు ఎలాంటి సహకారానికైనా ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు సామ్యూల్, రాజశేఖర్, పుష్ప రాజు, జాతిరాజు, రత్నం రాజు, స్థానిక సీనియర్ నాయకులు కాప సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *