janaprabha

janam kosam manam

కుత్బుల్లాపూర్, గాజులరామారం మున్సిపల్ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ జనవరి 26,

జిహెచ్ఎంసి గాజుల రామారం – కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల మున్సిపల్ కార్యాలయాల్లో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ 15 ఆగస్టు, 1947 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, అయినప్పటికీ మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేదన్నారు. మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చిందని అలా 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి పూర్తి గణతంత్ర దినోత్సవంగా భారత దేశం అయ్యిందని అన్నారు. భారతదేశ గణతంత్ర, స్వాతంత్ర్యానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ, వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసీలు రవీందర్ కుమార్, మంగతాయారు మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీ పాల్స్ లూథరన్ చర్చ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…
రంగారెడ్డి నగర్ 127డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్టీ పాల్స్ లూథరన్ చర్చ్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన చర్చ్ ను ప్రారంభించడం ఎంతో సంతోషకరం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రిస్టియన్ సోదరుల అభ్యున్నతికి గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా కృషి చేస్తుందని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులకు ఎలాంటి సహకారానికైనా ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు సామ్యూల్, రాజశేఖర్, పుష్ప రాజు, జాతిరాజు, రత్నం రాజు, స్థానిక సీనియర్ నాయకులు కాప సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి నగర్ డివిజన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ రంగారెడ్డి డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ తెలంగాణ తల్లి విగ్రహం, శివాజీ ఆటో స్టాండ్ వద్ద నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *