janaprabha

janam kosam manam

సైక్లింగ్ తో మెరుగైన ఆరోగ్యం…

1 min read

 

పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్ దోహదం…

HCG ‘పాట్రియాటిక్ రైడ్‘ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…*

హైదరాబాద్ జనవరి 26,

సైక్లిస్ట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో 100 కిలోమీటర్లు 150 మంది సైక్లిస్ట్ లతో నిర్వహించిన ‘పాట్రియాటిక్ రైడ్‘ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుచిత్ర వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనం కోసం సైక్లింగ్ ను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలని కోరారు. ప్రజల్లో సైక్లింగ్ పట్ల అవగాహన, ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. సైక్లింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వాహనాల వల్ల రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని సైక్లింగ్ తో అరికట్టవచ్చని అన్నారు. సైక్లింగ్ చేస్తే మెరుగైన ఆరోగ్యం పాటు, గుండె జబ్బులు, శ్వాస సంబంధిత వ్యాధులు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో సైక్లిస్ట్ రవీందర్, భీమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *