మంత్రి కేటీఆర్ సహకారంతో ‘కొంపల్లి మున్సిపాలిటీ ను ఆదర్శవంతంగా రూపుదిద్దుతాం

సుమారు రూ.3.కోట్ల 31 లక్షల అభివృద్ధి పనుల శంఖుస్థాపనలో మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ జనవరి 25,
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుమారు రూ.3.కోట్ల 31 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి సి.ఎచ్.మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కే.పి.వివేకానంద్ ముఖ్య అతిధులుగా మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటిగా కొంపల్లి మున్సిపాలిటీ ని తీర్చిదిద్దుతామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో నిధులకు కొరత లేకుండా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, మౌలిక వసతుల కల్పనే ప్రధానలక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు,టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించి ప్రోత్సహించాలని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.