janaprabha

janam kosam manam

రేణుక ఎల్లమ్మ దేవి అమ్మవారిని దర్శించుకున్నా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ జనవరి 25,

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ దేవి జాతర ను పురస్కరించుకొని ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకనంద్ రేణుక ఎల్లమ్మ దేవిని దర్శించుకొని రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, అమరం గోపాలరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మరియు పి.ఎ.సి.ఎస్ చైర్మన్ మిద్దిల బాల్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోలీస్ గోవింద్ రెడ్డి, కార్పొరేటర్ చిట్ల దివాకర్, మాజి పి.ఎ.సి.ఎస్ చైర్మన్ రవి యాదవ్, తెరాస నేతలు బుచ్చి రెడ్డి, మురళి యాదవ్, విష్ణు రెడ్డి,దర్శన్ రెడ్డి, ధర్మ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *