దామాషా పద్దతిలో ఎన్నికలు జరగాలి: నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్

ఎ.ఐ.వై.ఎఫ్ నిర్వహించిన పోటీలో సిపిఐ కార్యదర్శి ఉమా మహేష్
కుత్బుల్లాపూర్ జనవరి 24,72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ మండలం ఎ.ఐ.వై.ఎఫ్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన,వ్రక్తుత్వ పోటీలకు ముఖ్య అతిథిగా సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్ పాల్గొన పాల్గొని పోటీదారులను ఉదేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కేవలం 39 శాతం ఓట్లు వచ్చిన బిజెపి 100 శాతం ప్రజలను పరిపాలించడం వల్ల 65 శాతం ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉందని ప్రజలంతా ఇది గమనించాలని కోరారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన వారిలో సుమారు 60 శాతం ప్రజలు మాకు (ఎన్ డి ఎ),బీజేపీ వద్దని తీర్పు ఇచ్చారని అంటే మెజారిటీ ప్రజలు బీజేపీని వద్దు అనుకున్నారని కానీ మెజారిటీ ప్రజల నిర్ణయం కాకుండా కేవలం సీట్ల ప్రాతిపదికన ప్రభుత్వాని నడిపిస్తున్నారని అన్నారు. ఇలా కావడం వల్లే ప్రజలు ఓటు వేయడం పై దృష్టి పెట్టడం లేదని అన్నారు. అలాగే విద్య సంస్థల్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్ధి దశ నుండే రాజకీయాల్లో కి విద్యార్థులు రావడం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలపడే పరిస్థితి వస్తుంది అన్నారు.ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సరిగ్గ పని చెయ్యకపోతే వారిని తొలగించే అధికారం కూడా రావాలని కోరారు. ఇలా తొలగించే అధికారం ప్రజలకు ఇస్తే ప్రజలు వంద శాతం ఓటింగ్లో పాల్గొంటారని,ప్రజా ప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరిగ్గ పని చేస్తారని అన్నారు. ఈ పోటీలో డా.రవి గౌడ్, న్యాయవాది సత్యనారాయణ, రిటైర్డ్ ఉపాధ్యాయులు సురేశ్, సినిమా అసోసియేట్ డైరెక్టర్ ఉపేందర్,ప్రజా నాట్యమండలి నాయకులు రాములు,ప్రవీణ్, వెంకట్ రెడ్డి, ఎ.ఐ.వై.ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ వెంకటేష్ అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు హరనాథ్,కొమ్ము వెంకటేష్, యాకుబ్, లింగాచారి,మహేశ్, శ్రీకాంత్,కీర్తి,సుధాకర్,చంద్రయ్య ల తో పాటు తదితరులు పాల్గొన్నారు.