సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్ణయాలు రాష్ర్టాభివృద్ధి, పేదల సంక్షేమానికి మేలు…

*263 మంది లబ్ధిదారులకు రూ.2,63,30,508 విలువగల కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…*
కుత్బుల్లాపూర్ జనవరి 11, గాజులరామారం పరిధిలోని (37), 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని (54), 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని (36), 128 చింతల్ డివిజన్ పరిధిలోని (21), 129 సూరారం డివిజన్ పరిధిలోని (38), 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని (36), 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని (14), 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని (27) మొత్తం 263 మంది లబ్ధిదారులకు రూ.2,63,30,508 విలువ చేసే కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆయా డివిజన్ ల కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకంతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే గతంలో అప్పులు చేయాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకంతో తొలగించారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా అందులో పేదలకు మంచి జరగాలనే ఆలోచనతో పని చేస్తుందని అన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు అందుకున్న ఆడబిడ్డలు సీఎం కేసీఆర్ ని మేనమామగా వర్ణించుకుంటూ ఆయనకు రుణపడి ఉంటామని చెబుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయణిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్ణయాలు రాష్ర్టాభివృద్ధి, పేదల సంక్షేమానికి మేలు చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, మహ్మద్ రఫీ, సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.