janaprabha

janam kosam manam

ప్రపంచ మానవాళి శాంతి మరియు సోదరభావానికి గురు గోబింద్ బోధనలు మార్గదర్శకాలు:-ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

కుత్బుల్లాపూర్ జనవరి 24,
ప్రపంచంలోని మానవులంతా సమానమేనని, భగవంతుడు అందరికీ ఒక్కడేనని, మానవత్వం, దయ, జాలి, ప్రేమలను ఆచరించి జీవించేవించడమే పరమాత్మను చేరే మార్గతత్వము అని,జీవనమార్గాన్ని సూచించే సూక్తులు, విశాలతత్వంతో జీవించే మార్గాలూ గురు గోబిందు గారి బోధనలలో ఉన్నాయి అని, గురు గోబింద్ బోధనల ద్వారా దైనందిన జీవితంలోని సమస్యల నుండి బయటపడటం చాలా సులభము అని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గారు నియోజవర్గము పరిధి 130 సుభాష్ నగర్ డివిజన్ లోని గణేష్ గ్రౌండ్స్ లో పంజాబీ సోదరులు నిర్వహించిన గురు గోబిందు గారి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, బల్బీర్ సింగ్, శేషు, పద్మా రెడ్డి, అమృత్ సింగ్, అత్తర్ సింగ్, రాజ్ ధీర్ సింగ్, శ్రీనివాస్, ఇస్మాయిల్, శివాజీ, శ్రీకాంత్ మరియు సిక్కు సోదరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *