janaprabha

janam kosam manam

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కుత్బుల్లాపూర్ జనవరి 23, జగద్గిరిగుట్ట 126 డివిజన్ కార్పొరేటర్ జగన్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కెసిఆర్ కి అగ్ర కులాలలో ఉన్న పేద వారి కోసం విద్య, ఉద్యోగ అవకాశాలు 10 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్ మరియు గంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ 74 సంవత్సరాల భారత దేశంలో అగ్ర వర్ణాల పేద వారు సరైన ఉపాధి లేక విద్యా అవకాశాలు లేక ఎన్నో బాధలు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో అగ్ర వర్ణాల పేద ప్రజలకు అన్ని రంగాలలో అందరితో సమానంగా అవకాశాలు కల్పిస్తున్న కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ గౌడ్, పాపులు గౌడ్, మల్లారెడ్డి, పాపిరెడ్డి, సాజిద్, దాసు, యువజన నాయకులు జైహింద్, తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *