janaprabha

janam kosam manam

బాచుపల్లి జనవరి 22,

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రామ్ మందిరం నిర్మాణం నిధి సేకరణ ,రాముడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తక్షణమే భర్తరఫ్ చేయాలని, హిందువులందరికీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుమేరకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ కోతి బొమ్మ సెంటర్ నందు ధర్నా చేయడమే కాకుండా విద్యాసాగర్రావు చిత్రపటాలను దగ్నం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం నందు సంతోష్ కుమార్ ,విష్ణువర్ధన్ ,రాజు, శిల్పా రెడ్డి మాట్లాడుతూ, హిందూ వ్యతిరేక ప్రభుత్వ చర్యలు, రామ మందిర నిర్మాణం పై అనుచిత వ్యాఖ్యలు తప్పుపట్టడం కాకుండా ఎమ్మెల్యే పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేయడమే కాకుండా, రోజు రోజుకి భారతీయ జనతా పార్టీ ,హిందూ బంధువులందనీ చూసి భయపడే పరిస్థితి, అంతేకాకుండా ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం కనుసన్నల్లో పరిపాలన సాగిస్తూ, ప్రభుత్వ నడుపుతూ సంతృప్తిపరచడానికి ,ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామమందిర నిర్మాణానికి హిందూ బంధువులందరూ ప్రతి గడపగడపకు వెళుతూ రామమందిర నిర్మాణం లో ప్రతి హిందూ బంధువులం విరాళం ఉండేవిధంగా కృషి చేస్తున్న తరుణంలో, రాముడుపై కోరుట్ల అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా రాముడు అయోధ్య మందిర నిర్మాణానికి చందాలు ఇవ్వరాదని, అయోధ్య రాముడు కి నార్త్, సౌత్ ప్రాంతీయ విభేదాలు సృష్టించడం , భారతీయ జనతా పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ,టిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు హిందూ వ్యతిరేక గానే మాట్లాడుతున్నారని ,హిందూ వ్యతిరేక చర్యల్ని చేయడమే కాకుండా హిందువుల పై అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించిన పోవడాన్ని చూస్తే, హిందూ వ్యతిరేక ప్రభుత్వం గానే చూస్తున్నామని, రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ చేస్తున్న, వారిని బిచ్చమెత్తుకుంటున్న హిందువులని ఏలన చేసిన ఎమ్మెల్యే, వేరమతం పట్ల ఈ విధంగానే విమర్శ చేయగలిగే దమ్ము ధైర్యం ఉందని ? టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కోసం 2017 లో నిధి సేకరణ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది కదా ? మీరు చేసింది కూడా భిక్ష ఏటనే కదా అని మర్చిపోతే ఎలా ? రాముడి గుడి కోసం రామభక్తుల ఏమైనా చేయడానికైనా సిద్ధం, రామ్ మందిరం నిర్మాణం తద్యం అని గుర్తించుకో విద్యాసాగర్ రావు అని, టిఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల మనోభావాలు కి గౌరవించాలని, తక్షణమే ఎమ్మెల్యేలు భర్తరఫ్ చేయాలని, హిందూ బంధువులందరికీ ప్రభుత్వం క్షమాపణ చెప్పడం కాకుండా పదేపదే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ నేను పెద్ద హిందువులను చెప్పుకుంటారు కదా! అయోధ్య రామమందిరం నిర్మాణానికి పది రూపాయల విరాళం ఇచ్చిన హిందువునని నిరూపించుకోవాలి లేకుంటే తాను తన ప్రభుత్వం కూడా హిందూ వ్యతిరేక ప్రభుత్వo, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హిందూ ప్రజలందరూ కలిసి త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం బొంద పెట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మహిళా సెక్రెటరీ శిల్పా రెడ్డి, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమల్లేశ్వరి ,నిజాంపేట్ కార్పొరేషన్ జనరల్ సెక్రెటరీ సుమన్ రావు, నరేంద్ర చౌదరి ,కార్పొరేషన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్, సంతోష్ కుమార్, సెక్రటరీలు అనిత, అరుణ్ రావు, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మదన్ గౌడ్, ఐ టి ఇంచార్జ్ శరత్, కార్యవర్గ సభ్యులు చరణ్ నవ్య పట్నాయక్, శ్రీధర్, శివ, సీనియర్ నాయకులు రామచంద్రనాయక్, డాక్టర్ రాజు ,అశోక్ , ఇతర సీనియర్ నాయకులు, హిందూ బంధువులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *