janaprabha

janam kosam manam

క్రీడా సామాగ్రి అందజేసిన కె.పి విశాల్ గౌడ్


కుత్బుల్లాపూర్ జనవరి 18,
టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కెపి విశాల్ గౌడ్ 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పలు కాలనీల,బస్తీల యువకులకు జిహెచ్ఎంసి వారి సహకారంతో క్రీడా సామాగ్రిని అందజేసినారు. వారిని క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేడు అనగా తేదీ 17 జనవరి 2021 రోజున యువ నేస్తం ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ షటిల్ మరియు వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యువ నేస్తం ఫౌండేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.పి.విశాల్ గౌడ్ విచ్చేసి, టాస్ వేసి టోర్నమెంట్ లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ ఫేస్ 3, యం.ఎన్.రెడ్డి నగర్ శివాలయం, జయ రామ్ నగర్, వీరస్వామి నగర్, న్యూ వివేకానంద్ నగర్, యం.ఎన్. రెడ్డి నగర్ వెస్ట్, విమనపురి కాలనీ, న్యూ ప్రశాంత్ నగర్, బోలా శంకర్ నగర్, చంద్రయ్య నగర్, కుత్బుల్లాపూర్ గ్రామం క్రీడాకారులు,యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *