
కుత్బుల్లాపూర్ జనవరి 16,
ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె. యం.ప్రతాప్ చే నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరింప చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ నాయిబ్రాహ్మణులు ఐక్యతగా ఉండాలన్నారు, ఎల్లప్పుడు నాయీ బ్రాహ్మణులకు అందుబాటులో ఉంటా నన్నారు, వారి సమస్యలపై పోరాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో టి. ఆర్.ఎస్. పార్టీ యువ నాయకులు కె.పి. విశాల్ గౌడ్,ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘం చైర్మన్ రవీందర్ నాయి, అధ్యక్షులు మైలారం యాదగిరి నాయి, అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయి, ప్రధాన కార్యదర్శి వి ఎస్ ఆర్ వెంకటేష్ నాయి, కోశాధికారి మధు నాయి తదితరులు పాల్గొన్నారు.