janaprabha

janam kosam manam

*సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు… ముఖ్యఅతిథిగా కె.పీ విశాల్ గౌడ్

1 min read

కుత్బుల్లాపూర్ జనవరి 15,(వార్తాప్రభ):
సంక్రాంతి పండుగ సందర్భంగా అయోధ్య నగర్ ప్రగతి సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కె.పి.విశాల్ గౌడ్ విచ్చేసి, మహిళలు, ఆడపిల్లలు వేసిన ముగ్గులను పరిశీలించారు.ఆ తరువాత ముగ్గుల పోటీలలో గెలిచిన వారికి బహుమతులను అందజేసినారు. ముగ్గుల పోటీల్లో 35 మంది పాల్గొనగా అందులో ఐదు మంది విజేతలుగా నిలిచారు. అందులో మొదటి విజేతగా నిలిచిన పి.నవనీత కు షీల్డ్ మరియు రూ.2000/- క్యాష్ ప్రైజ్, రెండో విజేత బీమా భవాని కి షీల్డ్ మరియు రూ.1000/- క్యాష్ ప్రైజ్, మూడో విజేత ఏ.సునీత, నాలుగో విజేత నందిని, ఐదో విజేత అమ్ము లకు షీల్డ్ లను బహుకరించారు. మొదటి బహుమతి మరియు రెండో బహుమతి విజేతలకు క్యాష్ ప్రైజ్ ను స్వయంకృషి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమంలో ప్రగతి సాధన సమితి అధ్యక్షులు అచ్చిబాబు, ప్రధాన కార్యదర్శి శరభయ్య, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, సలహాదారుడు ధనరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మల్లేష్, కోశాధికారులు అరుణ్, సురేష్, జాయింట్ సెక్రెటరీ శివ, భాస్కర్, మల్లికార్జున్ రావు, కామేశ్వరరావు, ప్రసాద్, భాస్కరాచారి, సుభాష్ నగర్ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బిజిలి కృష్ణ, స్వయంకృషి యూత్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *