janaprabha

janam kosam manam

నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్…

1 min read

నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్…

రూ.5.50 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ జనవరి 30,(జనప్రభ):

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన మాధవి, పుష్పలతలు ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సదరుకుటుంబానికి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద దరఖాస్తు చేయించి ప్రభుత్వం ద్వారా రూ.5.50 లక్షలు మంజూరు చేయించారు. సంబంధిత చెక్కును ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఏ ఆపద వచ్చినా తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, కార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ గోపి ఐఎఎస్, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ మరియు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *