janaprabha

janam kosam manam

కార్మికులకు అండగా ఉంటాం…

1 min read

కార్మికులకు అండగా ఉంటాం…

అల్కలి మెటల్స్ లిమిటెడ్ యూనియన్ జెండా ఆవిష్కరణ, సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ జనవరి 29, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని డి.పోచంపల్లిలో గల అల్కలి మెటల్స్ లిమిటెడ్ యూనిట్ -2 ఎంప్లాయీస్ యూనియన్ (టీఆర్ఎస్ కేవి) నుండి నూతనంగా ఎన్నికైన సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు బొంగునూరి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారం, సన్మాన కార్యక్రమానికి శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు సరైన గుర్తింపు లభిస్తుందని, కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కార్మికుల భద్రత, హక్కుల విషయంలో యాజమాన్యాలతో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. నూతన యూనియన్ అధ్యక్షుడు కార్మికులకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్మిక సోదరులకు ఏ కష్టం వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, నిజాంపేట్ డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కౌన్సిలర్ శంభిపూర్ కృష్ణ, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ మరియు యూనియన్ అడ్వైజర్ టి.యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుభాష్, పి.రమేష్, కే.యాదగిరి, ఎండి.సిద్ధిక్, వైస్ ప్రెసిడెంట్స్ ఎస్.కే.బాలమియ, ఎన్.నరేష్ చారి, ఎస్.బాల రాజు, జెనరల్ సెక్రెటరీ జే.బాలరాజు, జాయింట్ సెక్రటరీలు జే.జీతయ్య, పి.శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.సతీష్, ట్రెజరర్ ఏ.కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *