janaprabha

janam kosam manam

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

లక్ష విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును స్వయంగా జర్నలిస్టు ఇంటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ జనవరి 27,(జనప్రభ):కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల132వ డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ కు చెందిన జర్నలిస్టు ఆర్.శ్రీనివాస్ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జర్నలిస్టు కుటుంబానికి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద దరఖాస్తు చేయించి ప్రభుత్వం ద్వారా రూ.1 లక్ష మంజూరు చేయించారు. సంబంధిత చెక్కును ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్వయంగా జర్నలిస్టు కుటుంబానికి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందని, జర్నలిస్టులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జర్నలిస్టు మిత్రులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *