పేదలకు భరోసాగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ రూ.6.75 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్

పేదలకు భరోసాగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్
రూ.6.75 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 5,(జనప్రభ):
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన పార్వతమ్మ, వైభవ్, సుధాకర్, సోనియాల్ సింగ్ లు ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. కాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఆశ్రయించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే బాధితకుటుంబాలకు భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద దరఖాస్తు చేయించి నలుగురు లబ్ధిదారులకు రూ.6.75 లక్షల విలువ చేసే (ఎల్ఓసి) చెక్కులను శుక్రవారం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అనారోగ్యం పాలై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదల ప్రాణాలను సీఎంఆర్ఎఫ్ పథకం నిలుపుతుందని, సంక్షేమ పథకాలకు కరోనా, భారీ వరదల విపత్కర పరిస్థితుల్లో సైతం నిధులను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. పేదలకు భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.