janaprabha

janam kosam manam

దుండిగల్ మున్సిపాలిటీని అభివృద్ధిలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం

దుండిగల్ మున్సిపాలిటీని అభివృద్ధిలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం

రూ.1.57 కోట్ల అభివృద్ధి పనుల శంఖుస్థాపన, ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 3,(జనప్రభ):

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ గ్రామంలో రూ.1.57 కోట్ల పలు అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక చైర్మన్ సుంకరి కృష్ణ వేణి కృష్ణ తో కలిసి శంఖుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. మొదటగా 24వ వార్డులో రూ.5 లక్షలతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ, 25 వార్డులో రూ.30 లక్షలతో సీసి రోడ్డు, 21వ వార్డులో రూ.17 లక్షలతో బీటీ రోడ్డు, 22వ వార్డులో రూ.46.00 లక్షలతో భూగర్భ డ్రైనేజీ, రూ.10 లక్షలతో ఓపెన్ జిమ్, 23వ వార్డులో రూ.17 లక్షలతో బీటీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం రూ.22.00 లక్షలతో నిర్మించిన ప్రజా మరియు మహిళా మరుగు దొడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా పూర్తి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా ప్రజామరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. పబ్లిక్‌ టాయిలెట్లు లేక స్థానికంగా ఉండేవారితోపాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇబ్బంది ఎదురవకుండా పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కోట్ల నిధులు వెచ్చించి మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆదర్శ మున్సిపాలిటీగా దుండిగల్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తుడుం పద్మా రావు, కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ, లక్ష్మీ ఆంజనేయులు, సంధ్యా హనుమంత్ రావు, వెంకన్న, అనంతస్వామి, ఆనంద్, పిఎసిఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవింద్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *