భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి…

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి…
కట్ట మైసమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 2,(జనప్రభ):
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం డివిజన్ పరిధిలోని సూరారం గ్రామం కట్ట మైసమ్మ ఆలయం వద్ద ఈ నెల 13, 14, 15న శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేపట్టబోయే ఏర్పాట్లపై మంగళవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ, ఇంజనీరింగ్, హెచ్ఎండబ్ల్యుఎస్, శానిటేషన్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాల అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ కట్ట మైసమ్మ తల్లి జాతర సందర్భంగా నగర నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో ఉంటూ చర్యలు చేపట్టాలని సూచించారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య, పారిశుధ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులన్ని ఏర్పాటు చేయాలన్నారు. జాతర సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు తమ పూర్తి సహకారం తప్పక ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసీ రవీందర్ కుమార్, కార్పొరేటర్ కొలుకుల జగన్, సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.