శ్రీ రామ జన్మభూమి అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధులు సమర్పణ

శ్రీ రామ జన్మభూమి అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధులు సమర్పణ
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 2,(జనసభ):
శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వజ్ర డెవలపర్స్ అధినేత రాజు ఒక లక్ష రూపాయలు అక్షయ డెవలపర్స్ అధినేత ఎస్. జీవన్ రెడ్డి ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయల చెక్కును దుండిగల్ పి ఎస్ ఎస్ ఐ శేఖర్ రెడ్డి ఐదు వేల నూట పదహారు రూపాయలు ట్రస్ట్ సభ్యులు సికింద్రాబాద్ విభాగ్ ప్రచారక్ ముడుపు యాదిరెడ్డి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసరి కృష్ణారెడ్డి,గోనె మల్లారెడ్డి,లక్ష్మారెడ్డి,అనంత రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీతారామిరెడ్డి, నరసింహాచారి, రామ భక్తులు పాల్గొన్నారు.